సిరిసిల్లలో వస్త్రోత్పత్తి రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నైపుణ్యం గల నేతకార్మికుల కొరత తలెత్తింది. ప్రభుత్వ ఆర్డర్లు లేకపోవడం, నూలు అందుబాటులో లేకపోవడం వల్ల సాంచాలు తరచూ బంద్ అవుతున్నాయి. పని లేక కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది స్వస్థలాలకు వెళ్లిపోగా.. కొంతమంది ఆటోలు నడుపుతూ.. మరికొందరు కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు.