సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్ డబుల్ బెడ్ రూమ్ ప్రక్కన గల మురికి నీటి శుద్ధి కేంద్రం ప్రారంభించకపోవడంతో దళిత రైతులు, బీసీ రైతులకు సంబంధించిన 350 ఎకరాలలో సుమారుగా 200 మంది రైతుల వ్యవసాయ భూముల్లోకి మురికి కాలువ నీరు రావడంతో రైతుల భూములు చెరువులా మారింది. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శీనన్న, తదితరులు మురికి నీటి శుద్ధి కేంద్రం సంబంధించిన పనులు పూర్తి చేయాలని శనివారం తెలియజేసినారు.