దళిత హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేడ్కర్ అని కమాండెంట్ సురేష్ సోమవారం అన్నారు. సిరిసిల్ల పట్టణ పరిధి సర్దాపూర్ లోని బెటాలియన్ లో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలనేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళితుల హక్కుల కోసం పోరాటమే కాకుండా దేశ మొదటి న్యాయమంత్రిగా పనిచేసి ఎన్నో సేవలను అందించాలని కొనియాడారు. అసిస్టెంట్ కమాండెంట్ రాందాస్, సిబ్బంది పాల్గొన్నారు.