బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి లైవ్ డిటెక్టర్ పరీక్షకు హాజరవ్వాలని డిమాండ్ చేశారు. కేటీఆర్‌పై అక్రమంగా నోటీసులు పంపుతున్నారని ఆరోపించారు. రూ. 50 లక్షల కేసులో సీఎం పట్టుబడలేదా అని ప్రశ్నించారు. కేటీఆర్ సవాల్‌కి స్పందించి, లైవ్ డిటెక్టర్ పరీక్ష ద్వారా స్పష్టత తీసుకొచ్చే సమయం వచ్చిందని తెలిపారు. సత్యానికి ఎదురైన వారు భయపడాల్సిందేనని, ఈ అంశంపై ప్రజలు నిజాలు తెలుసుకోవాలన్నారు.