కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ భూసేకరణ పెండింగ్ పరిహారం త్వరగా చెల్లించాలని క్యాబినెట్ సెక్రటరీ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సిద్దిపేట, మెదక్, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలను సికింద్రాబాద్ రైల్వే లైన్ కు కలవడం వల్ల పారిశ్రామికంగా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వివరించారు. ప్రస్తుతం రెండవ దశ పనులు జరుగుతున్నాయన్నారు.