సిరిసిల్ల: విమర్శలు చేస్తే సహించేది లేదు

69చూసినవారు
సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై విమర్శలు చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సిరిసిల్లలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్  ఎమ్మెల్యేలు వెంకట్, రాజేందర్ రెడ్డి కేటీఆర్ పై విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి కేటీఆర్ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్