రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు మహనీయుల ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అని కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల పట్టణం పరిధిలోని సర్దాపూర్, జగ్గారావు పల్లిలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను మంగళవారం రాత్రి చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పవిత్రమైన రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం విచ్చిన్నం చేయాలని చూస్తుందని మండిపడ్డారు.