బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు, హక్కులను కాలరాస్తుందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలో బుధవారం జరిగిన సిఐటియు అనుబంధ రంగాల యూనియన్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలని దూకుడుగా అవలంబిస్తుందని మండిపడ్డారు. ఎల్లారెడ్డి, రమణ, రమేష్, గణేష్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.