బొప్పాపూర్‌లో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

52చూసినవారు
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో చౌడలమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలోని యాదవ కులస్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. పాడిపంటలు పుష్కలంగా పండాలని, గ్రామంలో శాంతి, సమృద్ధి నెలకొనాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, నైవేద్యాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్