తంగళ్ళపల్లి: రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలి

56చూసినవారు
ఈనెల 27న వరంగల్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని తంగళ్ళపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న అన్నారు. తంగళ్ళపల్లి లోని బీఆర్ఎస్ కార్యాలయంలో రజతోత్సవ పోస్టర్ ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలో కనివిని ఎరుగని విధంగా ఈ సభ నిర్వహించబడుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్