రైతుల ఉసురు తీస్తున్న రాక్షస ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని KTR సేన తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు భాస్కర్ అన్నారు. తంగళ్ళపల్లి మండలం రామన్నపల్లిలో KTR సేన గ్రామ శాఖ కమిటీని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. వడదెబ్బకు తాళలేక వడ్ల కుప్పలపైనే రైతులు బలి అవుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.