తంగళ్ళపల్లి: అంబేడ్కర్ పోరాటం మరువలేనిది: ఎంపీఓ

77చూసినవారు
బడుగు బలహీన వర్గాల కోసం బాబా సాహెబ్ అంబేడ్కర్ చేసిన పోరాటం మరువలేనిదని తంగళ్ళపల్లి ఎంపీఓ మిర్జా అఫ్జల్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా తంగళ్ళపల్లిలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి సోమవారం నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. క్యారం జగత్, గజభీంకర్ రాజన్న, పడిగెల మానస రాజు, ఎగుమామిడి వెంకట రమణారెడ్డి, కందుకూరి రామ గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్