తంగళ్ళపల్లిలోని హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా హనుమాన్ దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు హనుమాన్ మాలదారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజభీంకార్ రాజన్న, ఎగుమామిడి వెంకట రమణారెడ్డి, కందుకూరి రామా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.