తంగళ్ళపల్లి: ఎంపీడీవోకి వినతిపత్రం అందజేత

76చూసినవారు
తంగళ్ళపల్లి: ఎంపీడీవోకి వినతిపత్రం అందజేత
తంగళ్ళపల్లిలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో లక్ష్మీనారాయణకు ఫీల్డ్ అసిస్టెంట్లు బుధవారం వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఐఎన్టీయుసీ ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎంపీడీవో కు వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. 3 నెల పెండింగ్ వేతనాలు చెల్లించి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. దేవయ్య, శేఖర్, శ్రీనివాస్, పూర్ణచందర్, తిరుపతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్