ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని డిపిఓ మహమ్మద్ షరీఫ్ ఉద్దీన్ అన్నారు. తంగళ్ళపల్లిలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం సంబంధిత అధికారులు, నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదటి విడతలో అత్యంత నిరుపేదలను దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారుల ఎంపిక చేయాలని ఆయన సూచించారు. ఎంపిడిఓ లక్ష్మీనారాయణ, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.