కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే హక్కును హరించిందని కాంగ్రెస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు టోనీ అన్నారు. తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డిపల్లి, ఓబులాపూర్ లో ఆదివారం రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా టోనీ మాట్లాడుతూ గాంధీ చూపిన అహింస మార్గంలో కాంగ్రెస్ పార్టీ పయనిస్తుందని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం, రాజు, భరత్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.