దేశ రాజ్యాంగాన్ని కాల రాయాలని చూస్తే సహించేది లేదని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. తంగళ్ళపల్లి మండలం టెక్స్ టైల్ పార్కులో శుక్రవారం రాత్రి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చిన హక్కులను లేకుండా చేయాలని చూస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులు టోనీ, రాజశేఖర్, భరత్, ప్రశాంత్ పాల్గొన్నారు.