తంగళ్ళపల్లి: అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ

68చూసినవారు
తంగళ్ళపల్లి: అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలో ఎన్ఆర్ఈజీఎస్, పంచాయతీరాజ్ నుండి రూ 12 లక్షల నిధులతో విడుదలైన అంగన్వాడి భవనానికి కాంగ్రెస్ నాయకులు బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు టోనీ మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి చేయడంతోనే దేశం అభివృద్ధి అవుతుందని పేర్కొన్నారు. ఫ్యాక్స్ చైర్మన్ కోడూరి భాస్కర్ గౌడ్, శ్రీనివాస్, మునిగేల రాజు, తిరుపతి, బాలరాజు, లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్