పంచాయతీ ఎన్నికలకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. తాజాగా పంచాయతీరాజ్ శాఖ కొత్త పంచాయతీలతో కూడిన జాబితాను ఎన్నికల సంఘానికి బుధవారం అందజేసింది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో జైసేవాలాల్ తండా, రాచర్ల బాకురుపల్లి తండా, తాళ్లపల్లి, బోటివానిపల్లి, హీరాలాల్ తండాలను కొత్త గ్రామపంచాయతీలుగా పేర్కొంటూ జాబితా సిద్ధమైంది.