వీర్నపల్లి: అంబేడ్కర్ చేసిన కృషి మరువలేనిది: మల్లేశం

అంటరానితనం రూపుమాపడానికి బాబా సాహెబ్ అంబేడ్కర్ చేసిన కృషి మరువలేనిదని వీర్నపల్లి జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు పరుమల మల్లేశం అన్నారు. ఆయన జయంతి సందర్భంగా వీర్నపల్లిలోని అంబేద్కర్ విగ్రహానికి సోమవారం పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం విద్య, ఉద్యోగం, రాజకీయాలలో రిజర్వేషన్ కోసం రాజ్యాంగబద్ధమైన హక్కు కల్పించిన మహానేత అంబేడ్కర్ అని కొనియాడారు.