వేములవాడ పట్టణంలోని భవంతురా నగర్‌లో రేషన్ బియ్యం కోసం లబ్ధిదారులు గంటల పాటు క్యూలైన్లలో నిలబడుతున్నారు. ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వడం వల్ల గిరిజనులు, పేదవారు పెద్ద సంఖ్యలో రేషన్ తీసుకోవడానికి వచ్చారు. అయితే, మూడుసార్లు వేలిముద్రలు వేయాల్సి రావడం, నెట్‌వర్క్ సమస్యలు, సాఫ్ట్‌వేర్ అప్డేట్ లాంటి సాంకేతిక సమస్యల కారణంగా ఒక్కరికి రేషన్ పొందేందుకు సగటున 20 నిమిషాల సమయం పడుతుందన్నారు.