వేములవాడ మండలం అగ్రహారం స్టేజీ వద్ద సిరిసిల్ల-వేములవాడ ప్రధాన రహదారిలో ఉన్న యూటర్న్ ప్రమాదకరంగా మారింది. అంజన్న ఆలయం ఎదుట డివైడర్ వద్ద వాహనాలు యూటర్న్ తీసుకునే సమయంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో హనుమాన్ ఆలయం, కరీంనగర్ డెయిరీ, పాలిటెక్నిక్, డిగ్రీ, జేఎన్టీయూ కళాశాలలు ఉండటంతో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.