రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి బీసీ సంక్షేమ హాస్టల్ ను శనివారం సందర్శించిన ఏబీవీపీ నాయకులు. ఈ సందర్బంగా ఏబీవీపీ నాయకులు అక్కేం నాగరాజు మాట్లాడుతూ శుక్రవారం జరిగినటువంటి సంఘటన సరైన రక్షణ లేక విద్యార్ధికి పాము కరిచిందని విద్యార్ధికి మెరుగైన వైద్య కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కూనబోయిన ప్రవీణ్, వరుకొలు అవినాష్, చొప్పరి అభిరామ్,పాల్గొన్నారు.