ఎల్లారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన కాశవ్వ(70) ఈ నెల 9 న సంతకు వెళ్ళింది. సంత ముగించుకుని ఆటో కోసం చూస్తున్న కాశవ్వతో ఒక కిలాడీ లేడి మాటలు కలిపింది. అంబెడ్కర్ చౌరస్తా దగ్గర చాల ఆటోలు ఉంటాయి ఇద్దరం కలిసి వెళ్దాం అనగానే కాశవ్వ ఆ లేడితో వెళ్ళింది. కొద్ది దూరం వెళ్ళాక తనతో తెచ్చుకున్న కారం కాశవ్వ మొహం మీద చల్లి బంగారం తీసుకుని పారిపోయింది. కాశవ్వ అరుపులు విని చుట్టు పక్కల వారు వచ్చి కాశవ్వను ఇంటికి పంపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు ఆ కిలాడీ లేడిని పట్టుకున్నారు.