ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వంగ గిరిధర్ రెడ్డి ఓ సహాయ స్వచ్ఛంద సంస్థకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బ్లడ్ బ్యాంకు నుండి ఫోన్ చేసి సిరిసిల్ల సిరి హాస్పిటల్ లో ఒకరికి అత్యవసరంగా బ్లడ్ అవసరం ఉందని చెప్పడంతో వెంటనే అక్కడికి వెళ్లి వెంకటేశం అనే రోగికి బ్లడ్ ఇచ్చారు. దీంతో 50 సార్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగిందని పేర్కొన్నారు.