కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో గురువారం భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు కథలాపూర్ తహశీల్దార్ వినోద్ కు ఆర్జీలు సమర్పించారు. భూభారతితో రైతుల భూసమస్యలు పరిస్కారమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నగేష్, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.