వేములవాడ పట్టణంలోని శంకర మఠం సమీపంలో బ్రాహ్మణుల వసతి గృహ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. రాజన్న క్షేత్ర ప్రాంతంలో బ్రాహ్మణుల కోసం ఒక ప్రత్యేక వసతి గృహం ఏర్పాటు చేయడం సమాజ అభివృద్ధికి దిశగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ వసతి గృహ నిర్మాణానికి రూ. 10 లక్షల నిధులు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు.