వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈనెల 8వ తేదీ బుధవారం రానున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ కూడా ఖరారయ్యింది. ప్రధాని రాక సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ చరిత్రలో ఓ విశేషమేమంటే దివంగత మాజీ ప్రధాన మంత్రి పివి నరసింహారావు గతంలో శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలిలోని ధర్మకర్తలలో ఒకరిగా ఉన్నారు.