బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, నోట్ బుక్కులు మండల విద్యాధికారి లోకిని శ్రీనివాస్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు అందరూ ప్రభుత్వం అందించే అన్ని రకాల సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ, ప్రతిరోజు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని, మంచిగా చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.