వేములవాడలో విషాద ఘటన

60చూసినవారు
వేములవాడలో విషాద ఘటన
వేములవాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన కోల నరసవ్వ గురువారం మృతి చెందగా, ఆమె బంధువు పశువుల కిషన్ అంతిమయాత్రలో పాల్గొనడానికి వచ్చాడు. ఇంట్లో సంతాపం వ్యక్తం చేస్తూ ఇతర బంధువులను ఓదారుస్తుండగా, ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే గుండెపోటుతో కిషన్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది.

సంబంధిత పోస్ట్