న్యాయవాదిపై పోలీసుల దాడికి నిరసనగా వేములవాడ కోర్టు విధులను గురువారం బహిష్కరించారు. కోర్టు ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలిపినట్లు వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం తెలిపారు. సిద్దిపేట కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది రవికుమార్ ఓ కేసు విషయమై క్లైంట్ తరఫున మాట్లాడడానికి సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు దాడికి పాల్పడ్డారని అన్నారు.