కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మండలం అగ్రహారంలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో రూ 31 లక్షల నిధులతో ప్రాకార గోడ, ఆర్చి నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉన్నారు.