హైదరాబాద్ బాట పట్టిన వేములవాడ మున్నూరు కాపులు

60చూసినవారు
హైదరాబాద్ బాట పట్టిన వేములవాడ మున్నూరు కాపులు
వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు మంత్రి పదవి కల్పించాలని డిమాండ్ చేస్తూ మున్నూరు కాపు సంఘ సభ్యులు గురువారం హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక మున్నూరు కాపు నాయకుడికి మంత్రి పదవి రాకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణలో కాపు సామాజికవర్గానికి భారీగా జనాభా ఉన్నప్పటికీ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం తమ మనోభావాలను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్