
పెదాలపై, గడ్డంపై వెంట్రుకలొచ్చి ఇబ్బందిగా ఉందా.. ఈ ప్యాక్స్ ట్రై చేయండి!
కొంతమంది ఆడవారికి పై పెదవి, గడ్డంపై అవాంఛిత వెంట్రుకలు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యను తగ్గించేందుకు సహజమైన కొన్ని ప్యాక్స్ పనిచేస్తాయని నిపుణులు చెప్తున్నారు. 2 టేబుల్ స్పూన్ల ఓట్స్‌లో ఒక అరటి పండు కలిపి ముఖానికి రాసి 10–15 నిమిషాలు ఆగి కడగాలి. అలాగే పంచదారలో కొద్దిగా నిమ్మరసం, నీరు కలిపి ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి ఓసారి చేస్తే మంచిదట.