వేములవాడలో 9 వ తరగతి చదువుతున్న ఉప్పుల పవన్ రాజ్ ఢిల్లీలో హోం శాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ ని గురువారం కలిశాడు. పవన్ రాజ్ కరాటే అసోసియేషన్ అఫ్ ఇండియా వారు నిర్వహించే జాతీయ స్థాయి పోటీలలో ఎన్నిక అయిన విషయం తెలుసుకున్న బండి సంజయ్ పవన్ రాజ్ ను అభినందించారు. మన ప్రాంతానికి చెందిన వ్యక్తి జాతీయ స్థాయిలో ఎన్నిక కావడం సంతోషంగా ఉందని పవన్ రాజ్ ను ప్రశంశించారు. స్కూల్ వారిని అభినందించారు.