వేములవాడలో విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన అంజలి (53) 5 రోజుల క్రితం అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి డెంగ్యూతో పాటు ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని గుర్తించారు. దీంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.