ఆస్తి కోసం తమ్ముడి అంత్యక్రియలను అడ్డుకున్న అక్క (వీడియో)

76చూసినవారు
AP: ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం తమ్ముడి అంత్యక్రియలను అక్క అడ్డుపడ్డారు. కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన ఈశ్వరితో గిద్దలూరుకు చెందిన శివాచారికి వివాహం జరిగింది. మద్యానికి బానిసైన శివాచారి రిహాబిలిటేషన్ సెంటర్ ఉంటూ మృతి చెందారు. అయితే శివాచారి అక్క ప్రత్యూష అంత్యక్రియలకు అడ్డుపడి.. ఆస్తి ఇచ్చేది లేదని, కొడుకును వదిలేసి వేరే పెళ్లి చేసుకోమని ఈశ్వరికి సలహా ఇచ్చారు. భర్త మృతిపై ఈశ్వరి అనుమానం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్