హీరోయిన్ సాయిపల్లవి తన చెల్లెలు పూజా కన్నన్ పెళ్లి వేడుకల్లో డాన్స్ చేశారు. అమె చీర ధరించి వివాహ వేడుకల్లో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం నాగచైతన్య సరసన 'తండేల్' మూవీలో సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 20న విడుదల కానున్నట్లు తెలుస్తోంది.