మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు ఆర్మీ ఆఫీసర్లను కొట్టి వారి స్నేహితురాలిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇద్దరు ఆర్మీ అధికారులు తమ స్నేహితురాళ్లతో కలిసి కారులో బయటకి వెళ్లారు. ఈ క్రమంలో ఓ అల్లరి మూక వారి కారును చుట్టుముట్టి ఓ అధికారి, మహిళలపై దాడి చేశారు. రూ.10 లక్షలు ఇవ్వాలని వారు మరో అధికారిని డిమాండ్ చేశారు. దీంతో ఆ బాధితుడు తన సీనియర్లకు కాల్ చేసి సమాచారం ఇచ్చాడు.