ఈమధ్య కాలంలో గుండెపోటు భారిన పడుతున్న సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ క్రమంలో స్కైడైవింగ్ చేస్తున్న వ్యక్తికి ఆకాశంలోనే గుండెపోటు వచ్చిన హృదయ విదారక వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో స్కైడైవర్ బ్యాలెన్స్ కోల్పోయి అపస్మారక స్థితిలో అదుపు లేకుండా పడిపోతున్నట్లు కనిపిస్తుంది. స్కైడైవర్‌ను ఆస్ట్రేలియాలోని పెర్త్ నివాసి క్రిస్టోఫర్ జోన్స్‌గా గుర్తించారు. చివరికి జోన్స్‌ను ట్రైనర్ షెల్డన్ మెక్‌ఫార్లేన్ ఎంతో కష్టపడి కాపాడినట్లు సమాచారం.