SLBC టన్నెల్లో చిక్కుకున్న 8 మంది బతికే ఉన్నారా? అనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. వారు అందులో చిక్కుకొని రెండు రోజులు దాటింది. టన్నెల్ బోరింగ్ యంత్రం వద్దకు దాదాపు చేరుకున్న కొందరు రక్షణ సభ్యులు బురదలోకి దిగే ప్రయత్నాలు కూడా చేశారు. కానీ కటిక చీకటితోపాటు బురదలో కూరుకుపోయే పరిస్థితి ఉండటంతో వెనక్కు వచ్చేశారు. దూరం నుంచి బిగ్గరగా కేకలు వేస్తూ.. బాధితుల నుంచి స్పందన వస్తుందేమోనని చాలా సేపు ప్రయత్నాలు చేశారు. అటువైపు నుంచి స్పందన లేదు.