మూసీ బాధితులకు టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ అండగా ఉంటానన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘మీ ఇళ్లపై ఒక్క గడ్డపార కూడా పడదు. ఒక్క పొక్లెయిన్ కూడా రాదు. వస్తే నేను అడ్డుగా నిలబడతా. అన్యాయంగా మీ ఇళ్లపైకి బుల్డోజర్లు వస్తే కోర్టుకెళ్తా. న్యాయవాదిగా కోర్టులో కేసు వేసి న్యాయం చేస్తా. పిల్లాపాపలతో ప్రశాంతంగా నిద్రపోండి. మీ ఇళ్లు ఎవరూ కూల్చరు. అవసరమైతే ప్రభుత్వంతో పోరాటం చేస్తా’ అని ఆయన బాధితులకు భరోసా ఇచ్చారు.