ఐసీసీ ర్యాంకింగ్స్ లో అదరగొడుతున్న స్మృతి మంధన

76చూసినవారు
ఐసీసీ ర్యాంకింగ్స్ లో అదరగొడుతున్న స్మృతి మంధన
టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన ICC తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టింది. ఇటీవల శ్రీలంకలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసి మొత్తంగా 264 రన్స్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 727 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. తొలిస్థానంలో సాతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ కొనసాగుతోంది. ఇక భారత్‌ తరఫున టాప్‌-10లో మంధన ఒక్కరే ఉండడం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్