14 అంగుళాల పొడవున్న కత్తి భాగాన్ని మింగేసిన పాము

63చూసినవారు
14 అంగుళాల పొడవున్న కత్తి భాగాన్ని మింగేసిన పాము
కర్ణాటకలో ఉత్తర కన్నడ జిల్లా కుమటా గ్రామంలో ఓ నాగుపాము 14 అంగుళాల పొడవైన కత్తిని పిడి వరకు మింగేసింది. ఇంటి ముందు ఉంచిన కత్తిని పూర్తిగా తినేందుకు ప్రయత్నించింది. కానీ పూర్తిగా మింగలేక, కక్కలేక కదలలేని స్థితిలో ఉండిపోయింది. ఇంటి యజమాని పవన్ పాముని గమనించి, పశువుల ఆసుపత్రి సహాయకుడు అద్వైత్ భట్‌కు అప్పగించారు. సుమారు అర గంట శ్రమించి పాము నోటిలో నుంచి కత్తిని తీశారు. తరువాత అడవిలో వదిలిపెట్టారు.

సంబంధిత పోస్ట్