శీతాకాలం కారణంగా జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో మంచు విపరీతంగా కురుస్తున్నది. దీంతో జమ్ముకశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో మంచు దుప్పటి కప్పేసింది. జోరుగా మంచు పడుతుండటంతో పరిసర ప్రాంతాలన్నీ ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. దాంతో ఇవాళ గుల్మార్గ్‌కు వెళ్లిన పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.