అమెజాన్ ఆర్డర్‌లో ట్యాబ్‌కు బదులు సబ్బులు (వీడియో)

57చూసినవారు
TG: హైదరాబాద్ కెపీహెచ్‌బీ పీఎస్ పరిధిలోని శ్రీనివాస్‌నగర్ కాలనీకి చెందిన సుబ్బారావు తన భార్య కోసం రూ.18వేల ధర ఉన్న ట్యాబ్‌ని అమెజాన్‌లో ఆర్డర్ చేశారు. వారం రోజుల తర్వాత ఆర్డర్ ఇంటికి రావడంతో ఓపెన్ చేశారు. అయితే అందులో ట్యాబ్‌కు బదులు లైఫ్‌బాయ్ సోప్స్ కనిపించడంతో షాక్ అయ్యారు. ఈ విషయమై కెపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని సుబ్బారావు తెలిపారు.

సంబంధిత పోస్ట్