2022 జూన్‌లో నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2020-21 నాటికే భారత్‌లో 77లక్షల మంది గిగ్ రంగంలో ఉపాధి పొందుతున్నట్లుగా గుర్తించారు. తెలంగాణలో 4.20 లక్షల మంది గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ ఉన్నారు. గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్‌కు సామాజిక భద్రత కల్పించాలని నీతి ఆయోగ్ సూచించింది. దేశ శ్రామికరంగంలో గిగ్ వర్కర్స్ వాటా 1.5 శాతంగా ఉందని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది.