సాఫ్ట్‌వేర్ లోపం.. ఓ వ్యక్తి అకౌంట్లోకి రూ.9,900 కోట్లు

1090చూసినవారు
సాఫ్ట్‌వేర్ లోపం.. ఓ వ్యక్తి అకౌంట్లోకి రూ.9,900 కోట్లు
ఉత్తరప్రదేశ్‌లోని బదోహీ జిల్లాలో ఓ వ్యక్తి అకౌంట్లోకి రూ.9,900 కోట్లు దర్శనమిచ్చిన ఘటన వెలుగుచూసింది. భానుప్రకాశ్ అనే వ్యక్తికి స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ అకౌంట్లో ఈ మొత్తం కనిపించింది. దీంతో షాకైన భానుప్రకాశ్ బ్యాంకు అధికారులకు సమాచారమిచ్చాడు. సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా అతడి అకౌంట్లోకి ఈ నగదు పడినట్లు అధికారులు గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్