ముంబైలో ఓ అంధుడు రైలు పట్టాలపై పడిపోయాడు. ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తుండగా అదుపు తప్పి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఉన్న మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ వెంటనే స్పందించి అతడిని రక్షించడానికి ప్రయత్నించారు. చుట్టూ ఉన్న ప్రజల సహకారంతో రైలు వచ్చే ముందు ఆ వ్యక్తిని పట్టాల నుంచి పైకి లాగారు. లోకో పైలట్ రైలు వేగం తగ్గించి ప్రమాదాన్ని నివారించారు.