శంభాజీ రెండవ చత్రపతిగా పగ్గాలు చేపట్టాడు. 9 ఏళ్లు రాజ్యాన్ని కాపాడిన శంభాజీని 1689లో సన్నిహితులు ద్రోహం చేసి మొగల్ సైన్యానికి పట్టించారు. సంగమేశ్వర్‌లో రహస్యంగా ఉన్న శంభాజీ వివరాలు ద్రోహులు మొగల్ సైన్యానికి చేరవేశారు. ముఖర్రబ్ ఖాన్ నేతృత్వంలోని మొఘల్ సైన్యం శంభాజీ, ఆయన మిత్రుడు కవి కలశ్‌లను బంధించి.. సోలాపూర్ దగ్గర లోని అకలూజ్‌లో ఉన్న ఔరంగజేబు వద్దకు పంపారు. ఈ వార్త విన్న ఔరంగజేబు ఆ ప్రాంతానికి ఆనందంతో 'అసద్ నగర్'గా నామకరణం చేశాడు.